Transgenders to traffic regulate |ట్రాఫిక్ నియంత్రణకు ట్రాన్స్ జెండర్లు
Transgenders to traffic regulate |ట్రాఫిక్ నియంత్రణకు ట్రాన్స్ జెండర్లు
డ్రంగ్ అండ్ డ్రైవ్‌లో కూడా వారి సేవలు
వినూత్న ప్రయోగానికి శ్రీకారం చుట్టిన సీఎం రేవంత్ రెడ్డి
వెంటనే అధికారులకు ఆదేశాలు
Hyderabad : తెలంగాణ రాష్ట్ర రాజధాని అయిన హైదరాబాద్ మహా నగరంలో నానాటికి జనాభా అంతకంతకు పెరుగుతుంది. దీంతో ప్రజలు తమ అవసరాలకు ప్రజా రవాణాతో పాటు సొంత వాహనాలు కూడా విపరీతంగా కొనుగోలు చేస్తున్నారు. దీంతో నగర వీదుల్లో ట్రాఫిక్ సమస్య కూడా విపరీతంగా పెరిగిపోయింది. దీంతో ట్రాఫిక్ నియంత్రణ ఒక ప్రభుత్వానికి ఒక సవాలుగా మారింది. ఈ క్రమంలో నగరం నలుమూలలూ ఇదే సమస్యతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో ట్రాఫిక్ నియంత్రణ కోసం రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వినూత్న ఆలోచన చేశారు. ట్రాఫిక్ నియంత్రణ కోసం ట్రాన్స్‌జెండర్లను సద్వినియోగం చేసుకోవాలని భావించారు. వాళ్లను వాలంటీర్లుగా పెట్టి ట్రాఫిక్ నియంత్రించాలని నిర్ణయం తీసుకున్నారు. అనుకున్నదే తడువుగా ఈ అంశంపై ద్రుష్టి సారించాలని సంబంధిత అధికారులను సీఎం ఆదేశించారు.
అయితే గతంలో నిర్ణయించిన విధంగా తొలిదశలో రద్దీ ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ట్రాన్స్ జెండర్లను నియమించాలని సూచించారు. సిగ్నల్ జంపింగ్, ట్రాఫిక్ నిబంధనలు పాటించకుండా వెళ్లే వారిని నిరోధించేందుకు హోమ్ గార్డుల తరహాలో ట్రాన్స్ జెండర్ల సేవలు వినియోగించుకోవలన్నారు. నగరంలో నిర్వహించే డ్రంక్ అండ్ డ్రైవ్ లోనూ వారి సేవలను వినియోగించుకోవాలని సూచించారు. తద్వారా తాగి వాహనాలు నడపే వారి సంఖ్యను కూడా తగ్గించవచ్చని సీఎం అభిప్రాయపడ్డారు. వారికి హోమ్ గార్డ్ తరహాలో జీత భత్యాలను సమకూర్చేలా విధి విధానాలు రూపొందించాలని, ఈ మేరకు వారికి ప్రత్యేక డ్రెస్ కోడ్ ను రూపొందించాలని ఆదేశించారు. వీలైనంత త్వరగా ప్రయోగాత్మకంగా నిర్ణయాన్ని అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాల్సిందిగా అధికారులకు సీఎం అదేశించారు.
* * *
Leave A Comment